News January 18, 2025
భారీ ఎదురుదెబ్బ: మావో కీలక నేతతో పాటు 17 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఇటీవల జరిగిన <<15172708>>ఎన్‌కౌంటర్‌లో<<>> మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌తో పాటు 17 మంది మృతి చెందినట్లు ఆ పార్టీ ప్రకటించింది. చొక్కారావు 30 ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. ఇతనిపై రూ.50 లక్షల రివార్డు ఉంది. స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి.
Similar News
News February 7, 2026
శుభ సమయం (07-2-2026) శనివారం

➤ తిథి: బహుళ షష్టి తె.3.47 వరకు ➤ నక్షత్రం: చిత్త రా.3.37 వరకు ➤ శుభ సమయాలు: ఉ.08.03-8.5 వరకు, ఉ.10.18-ఉ.10.28, మ.12.12-మ.1.08 వరకు తిరిగి మ.2.05-మ.3.01 వరకు తిరిగి సా.4.55-సా.5.51 వరకు ➤ రాహుకాలం: ఉ.09.00-ఉ.10.30 ➤ యమగండం: మ.1.30-మ.3.00 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.06.03-ఉ.08.02 వరకు ➤ వర్జ్యం: ఉ.10.29-మ.12.12 వరకు ➤ అమృత ఘడియలు: రా.8.46-రా.10.28 వరకు
News February 7, 2026
క్యూఆర్ కోడ్‌తో భూవివరాలు సులభతరం: కలెక్టర్

పట్టాదారు పాసుపుస్తకాల్లోని క్యూఆర్ కోడ్ ద్వారా భూమి, యజమాని వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం కుర్నూతల గ్రామం వెంకట్ రాజు గారి పల్లెలో నిర్వహించిన పాసుపుస్తకాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, పుస్తకాల్లో పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు.
News February 7, 2026
వేటపాలెంలో తప్పిపోయిన ముగ్గురు బాలికల గుర్తింపు

ముగ్గురు చిన్నారులు తప్పిపోయి వేటపాలెం హైవే పై తిరుగుతుండగా శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ వద్ద వారిని ఎస్ఐ విచారించగా నెల్లూరు హోమ్ నుంచి వారు పారిపోయి వచ్చినట్లు చెబుతున్నారు. ముగ్గురు బాలికలు వేటపాలెం పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల సంరక్షణలో ఉన్నారన్నారు. వారి వివరాలు తెలిసినవారు వేటపాలెం ఎస్సై, చీరాల రూరల్ సీఐను సంప్రదించాలని కోరారు.


