News January 18, 2025
భూమి వైపు దూసుకొస్తోన్న గ్రహశకలం

భారీ స్టేడియం పరిమాణంతో 820 అడుగుల గ్రహశకలం భూమివైపు దూసుకొస్తోందని నాసా హెచ్చరించింది. ఇది రేపు భూమికి చేరువగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. 2024 WY70 అని పిలువబడే ఒక భారీ గ్రహశకలం 36,606 KMPH వేగంతో దూసుకొస్తోంది. ఒకవేళ ఇది భూమిని ఢీకొన్నట్లయితే భారీ ఎత్తున వినాశనం జరుగుతుందని, దీని ప్రభావం వందలాది అణు బాంబులతో సమానమని NASA తెలిపింది.
Similar News
News January 20, 2026
హరీశ్ రావును విచారించనున్న ఆరుగురు అధికారులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. HYDలోని జూబ్లీహిల్స్ PSలో సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ఆరుగురు అధికారుల బృందం ఆయనను విచారించనున్నట్లు తెలుస్తోంది. కాగా హరీశ్ వెంట ఆయన న్యాయవాది రాంచందర్‌రావును లోనికి అనుమతించలేదు. ఇప్పటికే ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, బాధితులుగా పేర్కొన్న BJP నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్‌ను విచారించిన సంగతి తెలిసిందే.
News January 20, 2026
ఇంధన భద్రత దిశగా భారత్ కీలక అడుగు

విదేశీ గడ్డపై భారత్ చమురు వేట ఫలించింది. అబుదాబీలో భారీగా ముడి చమురు నిక్షేపాలు దొరకడం మన ‘ఇంధన భద్రత’ దిశగా కీలక అడుగు. క్రూడాయిల్ కోసం విదేశాలపై ఆధారపడే మనకు అక్కడ సొంతంగా నిక్షేపాలు ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రో రిసోర్సెస్ జాయింట్ వెంచర్ సాధించిన ఈ విజయం అంతర్జాతీయంగా మన దేశ శక్తిని పెంచడమే కాకుండా భవిష్యత్తులో ఇంధన కొరత లేకుండా దేశాన్ని మరింత బలోపేతం చేయనుంది.
News January 20, 2026
మున్సిపాలిటీల్లో చీరల పంపిణీ ప్రారంభం

TG: మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. తొలి దశలో 67 మున్సిపాలిటీలలో 5 లక్షల చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రెండో దశలో మున్సిపల్ ఎన్నికలకు ముందు 60 మున్సిపాలిటీల్లో పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో కోటి చీరల పంపణీ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు పంపిణీ చేసింది.


