News January 19, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,49,539 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,31,444 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.95,765, అన్నదానం రూ.22,330,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News October 29, 2025
KNRలో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సెలవు ప్రకటిస్తూ విద్యాధికారులకు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అందుబాటులో ఉండాలని సూచించారు.
News October 29, 2025
KNR కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

తుఫాన్ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వర్షాల నేపథ్యంలో సహాయం కోసం 0878 2997247కు కాల్ చేయాలన్నారు. భారీ వర్షాలు వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News October 29, 2025
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కి మూడు రోజుల సెలవు

తుఫాన్ ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మూడు రోజులపాటు యార్డ్‌కు సెలవులు ప్రకటించింది. ఖరీదుదారులు, అడిదారుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ తెలిపింది. నవంబర్ 3న సోమవారం నుంచి యార్డులో మళ్లీ క్రయవిక్రయాలు ప్రారంభం కానున్నాయి. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని మార్కెట్ కమిటీ విజ్ఞప్తి చేసింది.


