News January 19, 2025
VZM: భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చిన్న శ్రీను

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ మంత్రి మంత్రి ముత్తంశెట్టి రాజీనామాతో ఆ ప్లేస్‌ను భర్తీ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మజ్జి శ్రీనివాసరావు విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
Similar News
News September 14, 2025
17న జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు

ఈనెల 17న రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జిల్లా బంద్ చేపడతామని కార్మిక సంఘ నాయకులు తెలిపారు. శనివారం చీపురుపల్లిలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఫ్రీ బస్సుతో రోడ్డున పడ్డ ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.25 వేలు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీవో వేధింపులు, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదం, రాజాం డ్రైవర్లు పాల్గొన్నారు.
News September 14, 2025
VZM: ‘గాలికుంటు వ్యాధిని నిరోధించండి’

విజయనగరం జిల్లాలో గాలికుంటు వ్యాధిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించే గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను తన చాంబర్లో శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా నెలరోజులపాటు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పశువులకు వేయడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చన్నారు.
News September 13, 2025
VZM: ‘షరతులు లేకుండా వాహన మిత్ర అమలు చేయాలి’

వాహన మిత్ర సంక్షేమ పథకంలో ఎలాంటి షరతులు లేకుండా ఆటో, మ్యాక్సీ, టాక్సీ, జీపు, టాటా మ్యాజిక్ డ్రైవర్లందరికీ అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. విజయనగరంలోని బుచ్చన్న కోనేరు వద్ద కార్మికులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నెలకు 5వేల పింఛన్‌తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.