News January 19, 2025

U19 WC: నేడు ఇండియాVSవెస్టిండీస్

image

ICC ఉమెన్స్ U19 వరల్డ్ కప్‌లో ఇవాళ భారత్ వెస్టిండీస్‌తో తలపడనుంది. మ.12 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచును స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ TV ఛానల్స్‌లో చూడవచ్చు. IND కెప్టెన్‌గా నికి ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఆసియా కప్‌లో టాప్ రన్ స్కోరర్ గొంగడి త్రిష, టాప్ వికెట్ టేకర్ ఆయుషి శుక్లా జట్టులో ఉండటం భారత్‌కు బలం. కాగా నేడు జరిగే మరో మ్యాచులో SL, మలేషియా తలపడనున్నాయి.

Similar News

News January 19, 2025

రాజకీయాల్లోకి ‘కట్టప్ప’ కూతురు

image

ప్రముఖ నటుడు సత్యరాజ్ కూతురు దివ్య రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీలో చేరారు. ఆమె తమిళనాడులో ప్రముఖ పోషకాహార నిపుణులు (న్యూట్రిషనిస్ట్)గా గుర్తింపు పొందారు. కాగా సత్యరాజ్ బాహుబలి, బాహుబలి-2 సినిమాల్లో కట్టప్పగా నటించి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.

News January 19, 2025

WEIGHT LOSS: 145kgs నుంచి 75kgలకు!

image

అజర్ హాసన్ అనే యువకుడు నాలుగేళ్లలో 70 కేజీల బరువు తగ్గి ఫిట్‌నెస్ మోడల్‌గా మారాడు. ఇందులో 55KGS 7 నెలల్లోనే తగ్గినట్లు చెప్పారు. అతడి బాడీ ఫ్యాట్ 55% నుంచి 9%కి తగ్గింది. సరైన శిక్షణ, కఠోర శ్రమ, బ్యాలన్స్‌డ్ డైట్‌తో ఇది సాధ్యమైందన్నారు. తన తండ్రి మృతదేహాన్ని సమాధిలో పెట్టేటప్పుడు ఊబకాయం వల్ల కిందికి వంగలేకపోయానని, ఆ తర్వాత శ్రమించి బరువు తగ్గినట్లు MTV రోడీస్ షోలో అజర్ తెలిపారు.

News January 19, 2025

ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, పవన్, KCR, KTR

image

TGలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, KCR, KTR ఫొటోలతో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘట్‌కేసర్ గట్టు మైసమ్మ జాతర సందర్భంగా అభిమానులు దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో CBNకు బాస్ ఈజ్ బ్యాక్, పవన్‌కు ట్రెండ్ సెట్టర్, KCRకు గాడ్ ఆఫ్ TG కమింగ్ సూన్, KTRకు ఫ్యూచర్ ఆఫ్ TG అని క్యాప్షన్స్ పెట్టారు. సీనియర్ NTR, లోకేశ్, చిరంజీవి, హరీశ్ రావు ఫొటోలు కూడా ఆ బ్యానర్‌లో ఉండటం గమనార్హం.