News January 19, 2025
నెల్లూరు: పెరుగుతున్న నిమ్మ ధరలు.. రైతుల్లో ఆనందం

రెండు రోజుల నుంచి నిమ్మ ధరలు ఊపందుకున్నాయి. ఇటీవల చలి ప్రభావం ఎక్కువ ఉండడంతో ధరలు ఆశించినంతగా లేక రైతులు ఆందోళన చెందారు. గూడూరు మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ. 25 నుంచి రూ. 35 వరకు పలుకుతున్నాయి. నాణ్యత కలిగిన నిమ్మకాయలు రూ. 45 పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. 50 కేజీల లూజు బస్తా రూ. 2,400 నుంచి 3,300 వరకు అమ్ముతున్నారు. నిమ్మ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Similar News
News March 4, 2026
నెల్లూరు కలెక్టర్ చొరవ.. వృద్ధురాలికి ఇల్లు

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పని తీరుపై ఓ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే ఒక అర్జీని కలెక్టర్‌కు ఇవ్వడంతో తన కుమారుడి నుంచి తన ఇంటిని తనకు ఇప్పించారని చెప్పారు. సమస్య పరిష్కరించిన కలెక్టర్‌ను వృద్ధురాలు రమాజ్యోతి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని కలెక్టర్ చెప్పారు.
News March 4, 2026
నెల్లూరు: లోన్లు ఇప్పిస్తాం.. మాకేంటి..?

బ్యాంకు రుణాలు రిసోర్స్ పర్సన్లకు కాసులు కురిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో 37వేల పొదుపు సంఘాల్లో 3.80 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది 1575.51 కోట్ల రుణ లక్ష్యానికి రూ.1301.67 కోట్లు పూర్తి చేశారు. రూ.లక్షకు రూ.5వేలు నుంచి రూ.10 వేలు వరకు గ్రూపు నుంచి వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.37 కోట్లు కమిషన్ల రూపంలో తీసుకుంటున్నారని సమాచారం. మీ దగ్గర ఎంత తీసుకున్నారో కామెంట్ చేయండి.
News March 4, 2026
ఆనం కుమారుల సైలెంట్‌కు కారణం ఏంటి?

నెల్లూరు రాజకీయం అంటే ముందుగా గుర్తు వచ్చేది అనం కుటుంబం. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి రెండు దశాబ్దాల పాటు నెల్లూరులో తిరుగులేని వ్యక్తిగా నిలబడ్డారు. అయితే ఆయన మరణాంతరం కుమారులు ఆనం రంగ మయూర్ రెడ్డి, ఏసి సుబ్బారెడ్డిలు సైలెంట్‌గా ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తారని ఆనం కుటుంబం అభిమానులు చెబుతున్నారు. వీరి రాజకీయ ఎంట్రీ ఏ పార్టీల నుంచి అనే దానిపై చర్చ సాగుతోంది.


