News January 19, 2025
ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
ఈపీఎఫ్ఓ సభ్యులకు సేవలు మరింత సులభతరమయ్యాయి. ఇకపై యజమాని ప్రమేయం లేకుండా సభ్యులు EPF ఖాతా బదిలీకి దరఖాస్తు చేసుకునేలా కేంద్రం సేవలను ప్రారంభించింది. 2017 అక్టోబర్ 1 తర్వాత UAN జారీతో పాటు ఈ-కేవైసీ, ఆధార్ లింక్ పూర్తయినవారికే ఇది వర్తించనుంది. దీంతో వ్యక్తిగత వివరాల్లో తప్పుల సవరణ సభ్యులే స్వయంగా చేసుకోవచ్చు. ఆధార్ లింక్ చేయనివారికి యజమాని ధ్రువీకరణ తప్పనిసరి.
Similar News
News February 5, 2025
కులగణన సర్వేలో మళ్లీ వివరాలివ్వొచ్చు: మంత్రి పొన్నం
TG: కులగణన సర్వేలో పాల్గొనని వారు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. అన్ని వర్గాలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తప్పుడు వార్తల వ్యాప్తి బలహీన వర్గాలపై దాడేనని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై వైఖరి ఏంటో ప్రతి పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించాలని అనుకుంటే ఎదుర్కొంటామని చెప్పారు.
News February 5, 2025
పెళ్లి కార్డు ఇన్విటేషన్ అదిరిపోయిందిగా..
పెళ్లి వేడుకలకు ఆహ్వానించేందుకు యువ జంటలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆధార్ కార్డు ఇన్విటేషన్ మరవకముందే కేరళలో ఓ జంట రేషన్ కార్డు తరహాలో వెడ్డింగ్ కార్డును రూపొందించారు. వరుడు ‘రేషన్ షాప్ బాయ్’గా స్థానికంగా పాపులర్ అవడంతో పెళ్లి కూతురు ఇలా డిజైన్ చేయించిందని సమాచారం. వీరి పెళ్లి ఈ నెల 2న జరిగింది. ఈ కార్డు వైరలవ్వగా క్రియేటివిటీ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
News February 5, 2025
ఏపీలో మిరప బోర్డు కోసం ప్రతిపాదనలు
APలో మిర్చి బోర్డు ఏర్పాటు కోసం తమకు ప్రతిపాదనలు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం సుగంధ ద్రవ్యాల బోర్డే దేశంలో మిర్చి ఉత్పత్తి, పరిశోధన, నాణ్యతా నిర్వహణ, దేశీయ మార్కెట్, ఎగుమతులు, ప్రోత్సాహకాలు సహా పలు విషయాలను పర్యవేక్షిస్తోందని తెలిపారు. మిర్చి నిల్వ పద్ధతులు, మార్కెట్ లింకేజ్ సహా ఇతర అంశాలపై రైతులు, వ్యాపారులకు ఈ బోర్డే సహాయం అందిస్తోందని వెల్లడించారు.