News January 19, 2025
రేషనలైజేషన్‌ను తప్పుబడుతోన్న ఉద్యోగ సంఘాలు
AP: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపట్టాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని వల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. మల్టీపర్పస్ ఉద్యోగులు అనే పేరుతో వివిధ పనులకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలనుకోవడం సరికాదని పేర్కొన్నాయి.
Similar News
News January 19, 2025
GREAT: ఈ తల్లికి 19 మంది పిల్లలు.. అయినా..
ఈ రోజుల్లో పెళ్లైతే చాలు చాలామంది చదువుకు ఫుల్ స్టాప్ పెడదామనుకుంటారు. అయితే సౌదీ అరేబియాలో హమ్దా అల్ రువైలీ అనే మహిళకు ఏకంగా 19 మంది పిల్లలున్నా చదువు ఆపలేదు. బిజినెస్ స్టడీస్‌లో PhD పూర్తి చేశారు. దీని కోసం పగటి పూట పనులు చేస్తూ, రాత్రిళ్లు చదివానని చెప్పారు. 40 ఏళ్ల వయసులో అన్ని బాధ్యతల నడుమ డాక్టరేట్ పూర్తి చేసిన ఈ మహిళకు అంతా సెల్యూట్ కొడుతున్నారు.
News January 19, 2025
‘రాబిన్ హుడ్’ ప్రమోషన్స్‌పై డైరెక్టర్ ఏమన్నారంటే?
టాలీవుడ్ హీరో నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా సమయం ఉందని, కొత్త తరహాలో ప్రచారాన్ని చేసి పబ్లిసిటీ తెచ్చుకోవాలని ఓ సినీ జర్నలిస్టు డైరెక్టర్ వెంకీ కుడుములకు సూచించారు. దీనికి వెంకీ స్పందిస్తూ.. ‘‘మీది ఏ సిటీ అని ఎవరైనా అడిగితే పబ్లి‘సిటీ’ అని చెప్పేంత రేంజ్‌లో ప్లాన్ చేస్తాం సార్’’ అని ఆయన రిప్లై ఇచ్చారు.
News January 19, 2025
భారీ జీతంతో జాబ్స్.. 5రోజులే అవకాశం!
కెనరా బ్యాంకుల్లో 60 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు ఈనెల 24తో ముగియనుంది. ఐటీలో గ్రాడ్యుయేట్, బీఈ/బీటెక్ చేసి, పని అనుభవం ఉన్న వారు అర్హులు. వయసు 35 ఏళ్లకు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.1.50లక్షల నుంచి రూ.2.25లక్షల వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు బ్యాంక్ <