News January 19, 2025
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎస్ఎస్సీ, ఆర్అర్బీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని టీజీ బీసీ ఉపాధి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ ఖాజానజీమ్ అలీ అప్సర్ తెలిపారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 9లోగా వెబ్సైట్ tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News January 30, 2026
NLG: జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రాజకీయ సమీకరణాలకు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. అసలైన పోరు అప్పుడే ప్రారంభం కానుంది. ఇటీవల ముగిసిన GP ఎన్నికల్లో తనదైన ముద్ర వేసిన అధికార కాంగ్రెస్ అదే ఉత్సాహాన్ని మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందా చూడాలి. మరోవైపు ప్రతిపక్ష BRS సైతం అధికార పార్టీ వ్యూహాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది.
News January 30, 2026
NLG: ఆ పంటల సాగు ఇక కనుమరుగే..

జిల్లాలో అపరాల పంటల సాగు ఏటేటా గణనీయంగా తగ్గుతోంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సాగు చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, రైతులు అపరాల సాగుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలో జిల్లాలో విస్తృతంగా సాగైన కంది, బొబ్బెర, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాల పంటలు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనుమరుగవుతున్నాయి. ఐదేళ్ల క్రితం పదివేల ఎకరాలకు పైగా సాగుచేసిన కంది పంట.. ప్రస్తుతం 1700 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు.
News January 30, 2026
జిల్లాలో రెండో రోజు 562 నామినేషన్లు దాఖలు

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు రెండో రోజు గురువారం 562 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 48 డివిజన్లకు 157 నామినేషన్లు, మిర్యాలగూడలో 48 వార్డులకు 176, దేవరకొండలో 2 వార్డులకు 89 నామినేషన్లు దాఖలు చేశారు. హాలియాలో 12 వార్డులకు 40, నందికొండలో 12 వార్డులకు 27, చండూరులో 10 వార్డులకు 29, చిట్యాలలో 12 వార్డులకు 44 నామినేషన్లు దాఖలు అయ్యాయి.


