News January 19, 2025
HYD ఓయో రూమ్‌లలో ఉంటూ గంజాయి వ్యాపారం

హైదరాబాదు ధూల్‌పేట జాలీ హనుమాన్ దేవాలయం వద్ద ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. వారు మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌కి చెందిన సంజన మాంజా(18), నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాజు(25) ఓయో రూమ్‌లలో అద్దెకు ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నారని వారు తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి వారిని పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 3.625 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Similar News
News January 20, 2026
నెల్లూరు: 27 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

నెల్లూరు జిల్లాలో ఈనెల 27 నుంచి ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఇంటర్ ఆర్ఐ, DEC సభ్యులతో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.విజయ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈనెల 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 23న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News January 20, 2026
నెల్లూరు కలెక్టర్‌కు అవార్డు

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా మరోసారి తన ప్రతిభ చూపారు. ఆయన అందించిన సేవలకు ఎన్నికల సంఘం అవార్డు ప్రకటించింది. అత్యధికంగా ఓటర్ల మ్యాపింగ్ చేయడంతో ఆయనకు ఈ అవార్డు లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈనెల 25వ తేదీ జరిగే కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు అందుకోనున్నారు.
News January 20, 2026
నెల్లూరు జిల్లాలో సరికొత్తగా అంగన్వాడీలు

నెల్లూరు జిల్లాలో 2,942 అంగన్వాడీ కేంద్రాలకు 1,037 సొంత భవనాల్లో మిగిలినవి అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. 401 కేంద్రాలను సక్ష అంగన్వాడీలకు కేంద్రం అభివృద్ధి చేస్తోంది. రూ.1.83కోట్లు ఖర్చు చేసి అంగన్వాడీల్లో కూరగాయలు పండించడం, ఇంకుడు గుంతలు నిర్మించడం, టీవీ, బొమ్మలు, ఇతరత్రా మౌలిక వసతులు కల్పిస్తోంది. మరో 205 కేంద్రాల అభివృద్ధికి గతేడాది ప్రతిపాదనలు పంపారు. వీటిని సైతం త్వరలో అభివృద్ధి చేస్తారు.


