News January 19, 2025

తిరుమల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది: షా

image

AP: విజయవాడలో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు చర్చించి, కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టిందన్నారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అంతర్గత విభేదాలను పక్కనబెట్టాలని సూచించారు. ‘హైందవ శంఖారావం’ విజయం పట్ల VHP, BJP నేతలను షా అభినందించారు.

Similar News

News February 5, 2026

భారత్ ట్యాక్సీ యాప్ ప్రారంభించనున్న అమిత్‌షా

image

జీరో సర్వీస్ ఛార్జీలతో కేంద్రం తీసుకొచ్చిన భారత్ ట్యాక్సీ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా యాప్‌ను ప్రారంభించనున్నారు. ముందుగా ఢిల్లీ, గుజరాత్‌లో ఈ విధానం విజయవంతమైతే ముంబై, బెంగళూరు, చెన్నై, HYD వంటి నగరాలకూ విస్తరించనుంది. డ్రైవర్లే వాటాదారులు కాగా 2.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటారని అంచనా. ప్రైవేట్ యాప్‌లతో పోలిస్తే 20-30% తక్కువ ధరకు సేవలు అందుబాటులో ఉంటాయి.

News February 5, 2026

పాలు పితికేటప్పుడు ఈ తప్పు చేయొద్దు

image

కొందరు పాడి రైతులు పశువు నుంచి పాలను సేకరించేటప్పుడు పొదుగు నుంచి పూర్తిగా పాలను తీయకుండా కొన్నింటిని వదిలేస్తారు. ఇలా పొదుగులో మిగిలిపోయిన పాలలోకి బాక్టీరియా చేరి పొదుగువాపు వ్యాధికి కారణమవుతుందని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అలాగే పొదుగుకు అయ్యే చిన్న గాయాలకు చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేస్తే, ఇన్ఫెక్షన్ నెమ్మదిగా పొదుగులోకి వ్యాపించి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

News February 5, 2026

గులాబీ నేతలకు ‘చపాతీ రోలర్’ గుబులు

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో BRS అభ్యర్థులకు ‘చపాతీ రోలర్’ గుర్తు గుబులు పుట్టిస్తోంది. ADR పార్టీ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కేటాయించిన ఆ గుర్తు కారును పోలి ఉందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో గుర్తులపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లోనూ ఇలాంటి గుర్తుల వల్ల ఓట్ల నష్టం జరిగిందని BRS పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని రద్దు చేయాలని ECని కూడా కోరింది.