News January 19, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు బాగుంది: వెంకటేశ్ ప్రసాద్

image

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ Xలో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇది మంచి స్క్వాడ్. 3 లీగ్ మ్యాచ్‌లు, ఆపై 2 నాకౌట్‌లతో కూడిన షార్ట్ టోర్నమెంట్. ఇండియా బాగా ఆడుతుందనిపిస్తుంది’ అని తెలిపారు. సచిన్, లారా, కోహ్లీల్లో గ్రేటెస్ట్ బ్యాటర్ ఎవరు అని అడగ్గా సచిన్ పేరు చెప్పారు. కపిల్ దేవ్, సచిన్‌లను గ్రేటెస్ట్ ఇండియన్ ప్లేయర్లన్నారు.

Similar News

News November 12, 2025

‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

image

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.

News November 12, 2025

SBIలో మేనేజర్ పోస్టులు

image

<>SBI <<>>10 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/PGDBM/PGDBA అర్హతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ పోస్టుకు 28- 40ఏళ్ల మధ్య, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 25 -35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.750. SC, ST, PWBDలకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in

News November 12, 2025

వేగం వద్దు.. ఇలా కూడా ఆనందపడవచ్చు!

image

బైక్, కార్లలో వేగంగా ప్రయాణించడం ద్వారా పొందే తాత్కాలిక సంతోషం కంటే, దైవ స్మరణలో నిమగ్నమై ఆ దైవత్వం గొప్పతనాన్ని తెలుసుకుంటే మనిషికి అంతకన్నా ఉన్నత స్థాయి ఉండదు. జీవితంలో నిజమైన ఆనందం ఆ వేగంలో లేదు. పరమాత్మ సృష్టించిన లోకంలోనే ఉంది. కోయిల నాదంలో, కురిసే చినుకులో, పూసే పూవులో, చిన్నపిల్లల మాటల్లో ఆ ఆనందాన్ని అనుభవించాలి. నిస్వార్థంగా ఇతరులకు చేసే సాయంలో లభించే సంతృప్తి ఎంతో గొప్పది.