News January 19, 2025

ఫిబ్రవరిలో రిలీజయ్యే సినిమాలివే!

image

వచ్చే నెలలో నాగచైతన్య ‘తండేల్’ (ఫిబ్రవరి 7), అజిత్ ‘పట్టుదల'(ఫిబ్రవరి 6)తో పాటు పలు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఫిబ్రవరి 14న విశ్వక్ సేన్ ‘లైలా’, కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’, బ్రహ్మానందం, ఆయన తనయుడు గౌతమ్ నటించిన ‘బ్రహ్మా ఆనందం’ విడుదలవుతున్నాయి. 21న సందీప్ కిషన్ ‘మజాకా’, తమిళ డబ్బింగ్ సినిమా ‘డ్రాగన్’ రిలీజ్ కానున్నాయి. వీటిలో మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?

Similar News

News January 19, 2025

సైఫ్ అలీఖాన్ హెల్త్ అప్డేట్

image

కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీఖాన్ కోలుకుంటున్నారని ఆయన సోదరి సోహా అలీఖాన్ తెలిపారు. ‘అన్నయ్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. కోలుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సైఫ్ కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు’ అని ఆమె మీడియాతో అన్నారు. ఈనెల 16న అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆయనను కత్తితో పొడిచాడు. మూడు రోజుల అనంతరం ఇవాళ నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

News January 19, 2025

లోకేశ్‌ను Dy.CM చేయడానికి అమిత్ షా ఒప్పుకోలేదు: అంబటి

image

AP: లోకేశ్‌ను Dy.CM చేస్తానన్న ప్రతిపాదనకు కేంద్రమంత్రి అమిత్ షా ఒప్పుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘షా ఏమన్నారో మాకు తెలుసు. లోకేశ్‌ అన్నిశాఖల్లో వేలు పెడుతున్నారని, కంట్రోల్‌లో ఉంచమని బాబుకు సూచించారు. లోకేశ్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమయ్యాడని, స్పీడ్ తగ్గించుకోవాలని హెచ్చరించారు’ అని తెలిపారు. ఈ విషయాలు బయటికి రాకుండా కూటమి నేతలు వేరే కథలు వండి వారుస్తున్నారని ఎద్దేవా చేశారు.

News January 19, 2025

కూటమి మాట నిలబెట్టుకోవాలి.. లేదంటే ఉద్యమం: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదని మోదీ, అమిత్ షా, చంద్రబాబు ఎందుకు చెప్పట్లేదని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే రూ.11వేల కోట్ల ప్యాకేజీకి ఎన్నో షరతులు పెట్టారన్నారు. దీనివెనుక ఏదో మతలబు ఉందని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రైవేటీకరణ జరగకుండా కూటమి నేతలు మాట నిలబెట్టుకోవాలని, లేదంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.