News January 19, 2025
సైఫ్ నిందితుడికి 5 రోజుల పోలీస్ కస్టడీ
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి నిందితుడికి బాంద్రా కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఇవాళ తెల్లవారుజామున అతడిని థానేలో అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలను రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు 5 రోజులు కస్టడీకి ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో దాడికి గల ప్రధాన కారణాలపై నిందితుడిని పోలీసులు ప్రశ్నించనున్నారు.
Similar News
News January 19, 2025
ఢిల్లీకి బయల్దేరిన సీఎం.. అక్కడి నుంచి జ్యురిచ్‌కు..
AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. అక్కడి నుంచి అర్ధరాత్రి ఆయన జ్యురిచ్‌కు వెళ్తారు. సీఎం వెంట మంత్రులు లోకేశ్, టీజీ భరత్, ఇతర అధికారులు వెళ్లనున్నారు. దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వీరు పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ‘బ్రాండ్ ఏపీ ప్రమోషన్’ పేరుతో సీఎం నేతృత్వంలోని బృందం 5 రోజులపాటు దావోస్‌లో పర్యటించనుంది.
News January 19, 2025
ఆర్థిక పరిస్థితి దుర్భరం.. అయినా పథకాల అమలు: మంత్రి జూపల్లి
TG: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వీటి అమలు లక్ష్యాన్ని నీరుగార్చొద్దని అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక జాగ్రత్తగా చేపట్టాలని, తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నప్పటికీ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
News January 19, 2025
పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్
ప్రముఖ యంగ్ సింగర్ దర్శన్ రావల్ పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు ధరల్ సురేలియాతో కలిసి ఏడడుగులు వేశారు. వీరికి అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2014లో ఇండియాస్ రా స్టార్ ఫస్ట్ సీజన్ ద్వారా ఇతను గుర్తింపు పొందారు. హిందీ, గుజరాతీ సినిమాల్లో వందకు పైగా పాటలు పాడారు. తెలుగులో నాని ‘జెర్సీ’ సినిమాలో ‘నీడ పడదని మంటననగలరా’ పాటను ఆలపించారు.