News March 17, 2024
నీలిచిత్రాలు ఎక్కువగా చూస్తున్నారా…?
పరిమితంగా ఉంటే అలవాటు. పరిధి దాటితే వ్యసనం. అలవాట్లు ప్రమాదకరం కాకపోవచ్చు కానీ.. వ్యసనంగా మారే ఏదైనా ప్రమాదమే. నీలిచిత్రాల విషయంలోనూ ఇది వర్తిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఒకస్థాయి తర్వాత మెదడు ఉద్వేగరహిత స్థాయికి చేరి మొద్దుబారిపోతుందంటున్నారు. ‘పోర్న్ వ్యసనంతో శృంగారాన్ని ఆస్వాదించే సామర్థ్యాన్ని మెదడు కోల్పోతుంది. దాంపత్యంపై అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది’ అని నిపుణులు వారిస్తున్నారు.
Similar News
News December 23, 2024
VRO వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు
తెలంగాణలో VRO వ్యవస్థ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించనుంది. పాత ఉద్యోగులను మళ్లీ VRO పోస్టుల్లోకి తీసుకోనుంది. ఇందుకోసం ఈ నెల 28 వరకు గడువు విధిస్తూ CCLA కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత ప్రభుత్వంలో VROలను ఇతర శాఖలకు బదలాయించగా, వారిని వెనక్కి రప్పించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.
News December 23, 2024
ఇంటర్‌పోల్ కోసం భారత్‌పోల్.. సిద్ధం చేసిన CBI
ఇంటర్‌పోల్ నుంచి అవసరమైన సమాచారాన్ని పొందేలా అన్ని రాష్ట్రాలు, దర్యాప్తు సంస్థల కోసం సరికొత్త టెక్నాలజీ వ్యవస్థ ‘భారత్‌పోల్’ను CBI సిద్ధం చేసింది. ఇప్పటిదాకా ఇంటర్‌పోల్ సమాచారం కోసం ఏజెన్సీలు అన్నీ CBIకు అభ్యర్థనలు పంపేవి. దీని వల్ల కేసుల విచారణకు అధిక సమయం పడుతుండడంతో ఈ సమీకృత వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ట్రయల్స్ దశలో ఉన్న ఈ టెక్నాలజీని Jan 7న అమిత్ షా ప్రారంభించే అవకాశం ఉంది.
News December 23, 2024
కాంగ్రెస్ Vs బీఆర్ఎస్.. మధ్యలో అల్లు అర్జున్
TGలో అల్లు అర్జున్ కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. బన్నీ అరెస్టైనప్పుడు KTR ట్వీట్‌తో దుమారం రేగింది. కుట్రపూరితంగా అతడిని ఇరికిస్తున్నారని INC, రేవంత్‌పై BRS విమర్శలు గుప్పించింది. ఎదురుదాడికి దిగిన INC.. AAకు బీఆర్ఎస్సే డైరెక్షన్స్ ఇస్తోందని ఆరోపించింది. మొత్తం వ్యవహారంలో AA, BRS అభిమానులు ఒకవైపు, కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయి. మరి ఈ ‘సినీ రాజకీయం’ ఎక్కడివరకు వెళ్తుందో, ఎక్కడ ఆగుతుందో చూడాలి.