News January 19, 2025
దేశంతోనూ పోరాడుతున్నామన్న రాహుల్.. FIR ఫైల్
BJP, RSSతోపాటు దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందన్న లోక్‌సభ పక్షనేత రాహుల్ గాంధీపై మోన్‌జిత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో గువాహటి పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై FIR నమోదైంది. రాహుల్ వ్యాఖ్యలు వాక్‌స్వాతంత్య్ర పరిమితులను దాటాయని, అవి జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని మోన్‌జిత్ ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలో INC కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News January 19, 2025
ఖోఖో.. మనోళ్లు కొట్టేశారంతే!!
ఖోఖో తొలి ప్రపంచకప్‌లోనే భారత్ తన సత్తా చాటింది. మన పురుషులు, మహిళల జట్లు విశ్వ విజేతలుగా నిలిచాయి. కాసేపటి క్రితం ముగిసిన మెన్స్ ఫైనల్స్‌లో నేపాల్‌పై 54-36 తేడాతో టీమిండియా గెలుపొంది తొలి కప్‌ను ముద్దాడింది. అంతకుముందు అమ్మాయిల జట్టు సైతం నేపాల్ ఉమెన్స్ టీమ్‌ను 78-40 తేడాతో చిత్తు చేసి తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. భారత్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 23 దేశాలు పాల్గొన్నాయి.
News January 19, 2025
డబ్బులిస్తేనే కూల్చివేతలు ఆగుతాయని అధికారుల బెదిరింపులు: ఈటల
TG: హైడ్రా పేరుతో 3 నెలలుగా INC ప్రభుత్వం హంగామా చేస్తోందని BJP MP ఈటల రాజేందర్ విమర్శించారు. బాలాజీ నగర్, జవహర్ నగర్‌లో పేదలు భూములు కొని 40 ఏళ్లుగా అక్కడ ఉంటున్నారని తెలిపారు. డబ్బులిస్తేనే కూల్చివేతలు ఆగుతాయని అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని దుయ్యబట్టారు. ప్రతి పనిలో 7-10 శాతం కమీషన్ ఇవ్వనిదే బిల్లులు సెటిల్ కావట్లేదన్నారు.
News January 19, 2025
ఢిల్లీకి బయల్దేరిన సీఎం.. అక్కడి నుంచి జ్యురిచ్‌కు..
AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. అక్కడి నుంచి అర్ధరాత్రి ఆయన జ్యురిచ్‌కు వెళ్తారు. సీఎం వెంట మంత్రులు లోకేశ్, టీజీ భరత్, ఇతర అధికారులు వెళ్లనున్నారు. దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వీరు పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ‘బ్రాండ్ ఏపీ ప్రమోషన్’ పేరుతో సీఎం నేతృత్వంలోని బృందం 5 రోజులపాటు దావోస్‌లో పర్యటించనుంది.