News January 19, 2025

పద్యాలతో జ్ఞానజ్యోతిని వెలిగించిన లోకకవి వేమన: JNTU ఇన్‌ఛార్జ్ వీసీ

image

అనంతపురం JNTUలోని పరిపాలన భవనంలో ఆదివారం యోగి వేమన జయంతిని పురస్కరించుకొని JNTU ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్యతో కలిసి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇన్‌ఛార్జ్ వీసీ మాట్లాడుతూ.. ఎంతో అద్భుతమైన పద్యాలతో ప్రపంచానికి జ్ఞానజ్యోతిని వెలిగించిన లోకకవి వేమన అని కొనియాడారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 25, 2025

శిల్పారామంలో జనవరి 1న సాంస్కృతిక కార్యక్రమాలు

image

అనంతపురం శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా 2026 జనవరి 1న సాయంత్రం 5గంటల నుంచి 8 వరకు ప్రముఖ కళాకారులచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి గురువారం వివరాలు వెల్లడించారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. అనంత ప్రజల కోసం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.

News December 25, 2025

తాడిపత్రి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

తాడిపత్రి మండలంలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చల్లవారిపల్లె సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.

News December 25, 2025

అనంత జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి ఈయనే.!

image

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బొమ్మనహల్ దర్గా హోన్నూరు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు హెచ్.ఆనంద్‌ను జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నియమించారు. తాను పార్టీకి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని తెలిపారు. ఈ పదవిని ఇచ్చిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు.