News January 19, 2025

ఓ పెళ్లి కాని ప్రసాదులూ..! ఇది చదవండి..!!

image

ప్రయత్నిస్తే ప్రధాని కావచ్చేమో, పెళ్లి మాత్రం ఈ జన్మకి డౌటే! ఇది ఈ మధ్య వింటున్న ఫన్ ఫ్యాక్ట్. మారిన పరిస్థితులు, అమ్మాయిల ఆలోచనా విధానం, కొన్ని కులాల్లో అమ్మాయిల కొరతతో చాలామందికి వివాహాలు జరగడం లేదు. వ్యవసాయం, కుల వృత్తులు చేస్తున్నా, ఊర్లలో ఉన్నా మ్యాచ్ రావట్లేదనేది మ్యారేజ్ బ్రోకర్స్ మాట. పెళ్లి ఖర్చు సహా అమ్మాయికి అన్నీ తామే చూసుకుంటామన్నా కొందరికి సెట్ కాట్లేదట. మీ పరిస్థితి కూడా ఇదేనా?

Similar News

News January 19, 2025

పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా

image

భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్విటర్‌లో పెళ్లి ఫొటోలను పోస్ట్ చేశారు. దానికి నీరజ్- హిమాని అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా నీరజ్ భార్య హిమాని ప్రస్తుతం అమెరికాలో చదువుతున్నట్లు సమాచారం. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. త్వరలోనే గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

News January 19, 2025

USలో టిక్‌టాక్ బ్యాన్‌కు నేను వ్యతిరేకం.. కానీ: ఎలాన్ మస్క్

image

అమెరికాలో టిక్‌టాక్‌‌ బ్యాన్‌ అంశాన్ని తాను చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నానని బిలియనీర్ ఎలాన్ మస్క్ చెప్పారు. అది వాక్ స్వాతంత్ర్యానికి విరుద్ధమన్నారు. అయితే టిక్‌టాక్‌ను USలోకి అనుమతించినా చైనాలో Xకు ఎంట్రీ ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు. కచ్చితంగా మార్పు రావాల్సి ఉందని Xలో పోస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవల అమెరికాలో టిక్‌టాక్ సేవలను <<15193540>>నిలిపివేసిన విషయం<<>> తెలిసిందే.

News January 19, 2025

సీజ్‌ఫైర్: హమాస్ చెర నుంచి ముగ్గురు బందీలు విడుదల

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన గాజా కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో బందీల తొలి ఎక్స్ఛేంజీ జరిగింది. తమ చెరలో ఉన్న ముగ్గురిని ఇజ్రాయెల్‌కు హమాస్ అప్పగించింది. ఇందుకు బదులుగా తమ వద్ద ఉన్న 90 మంది పాలస్తీనా ఖైదీలను మరికొన్ని గంటల్లో ఇజ్రాయెల్ రిలీజ్ చేయనుంది. ఆ తర్వాత దశలో మరో 33 మంది ఇజ్రాయెలీలు హమాస్ చెర నుంచి విముక్తి పొందనున్నారు. బందీల మార్పు ప్రక్రియ 42 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.