News January 19, 2025

జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌ను కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే

image

ఇటీవల జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా నియమించబడిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లే గంగారెడ్డిని ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్యకర్తకు బీజేపీలో గుర్తింపు ఉంటుందని, దానికి నిదర్శనమే పల్లె గంగారెడ్డి అన్నారు.

Similar News

News November 13, 2025

మద్యం షాపులకు గుడ్ వీల్ ఒప్పందం

image

ASF జిల్లా వ్యాప్తంగా కొత్తగా మద్యం షాపులు వచ్చిన వారు నిర్వహణ భారమవుతుందని,ఇతరత్రా కారణాలతో ముందస్తుగా పాత లిక్కర్ వ్యాపారులకు కట్టబెడుతున్నారు. పాత మద్యం వ్యాపారులకే కొత్తగా డీల్ కుదుర్చుకొని డబ్బులు తీసుకొని తమకు దక్కిన లైసెన్స్ లను అప్పగిస్తున్నారు. వారికి వచ్చిన మద్యం దుకాణాలను ఇతరులకు అప్పగించి రూ.3లక్షల దరఖాస్తు ఫీజుతో పాటు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

News November 13, 2025

జూబ్లీహిల్స్ ఓటింగ్ వివరాలు

image

☛మొత్తం ఓటర్లు: 4,01,365
Male: 2,08,561
Female: 1,92,779
Others: 25
☛పోలైన ఓట్లు: 1,94,631
Male: 99,771
Female: 94,855
Others: 5
Polling Percentage: 48.49%

News November 13, 2025

ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లు.. 31మందితో జేపీసీ

image

తీవ్ర నేరారోపణలతో అరెస్టై 30 రోజులు జైల్లో ఉండే ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లును పరిశీలించేందుకు BJP MP అపరాజిత సారంగీ నేతృత్వంలో 31 మంది సభ్యుల JPC ఏర్పాటైంది. ఇందులో BJP నుంచి 15 మంది, NDA పార్టీల నుంచి 11 మంది ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించడంతో మిగతా విపక్ష పార్టీలకు చోటు దక్కింది. వీటిలో ఎన్సీపీ-ఎస్పీ, అకాలీదళ్, ఎంఐఎం, వైసీపీ ఉన్నాయి.