News January 19, 2025
పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్
ప్రముఖ యంగ్ సింగర్ దర్శన్ రావల్ పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు ధరల్ సురేలియాతో కలిసి ఏడడుగులు వేశారు. వీరికి అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2014లో ఇండియాస్ రా స్టార్ ఫస్ట్ సీజన్ ద్వారా ఇతను గుర్తింపు పొందారు. హిందీ, గుజరాతీ సినిమాల్లో వందకు పైగా పాటలు పాడారు. తెలుగులో నాని ‘జెర్సీ’ సినిమాలో ‘నీడ పడదని మంటననగలరా’ పాటను ఆలపించారు.
Similar News
News January 20, 2025
నేడు ట్రంప్ ప్రమాణ స్వీకారం
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వాషింగ్టన్ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత ప్రభుత్వం నుండి విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
News January 20, 2025
జనవరి 20: చరిత్రలో ఈరోజు
1900: సంస్కృతాంధ్ర పండితుడు పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం
1907: ప్రముఖ రంగస్థల నటుడు బందా కనకలింగేశ్వరరావు జననం
1920: సినీ దర్శకుడు, ‘జానపద బ్రహ్మ’ బి.విఠలాచార్య జననం
1940: సినీనటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు జననం
1957: భారత్ తొలి అణు రియాక్టర్ ‘అప్సర'(ముంబై) ప్రారంభం
News January 20, 2025
విశ్వవిజేతలకు మోదీ అభినందనలు
ఖో ఖో విశ్వవిజేతలుగా నిలిచిన భారత పురుషుల, మహిళల జట్లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయాలతో గర్విస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆటగాళ్ల పట్టుదల, నిబద్దత అభినందనీయమని కొనియాడారు. యువతకు ఖో ఖోలో ప్రాచుర్యం కల్పించేందుకు ఈ విజయం దోహదపడుతుందని పేర్కొన్నారు. దర్శకుడు రాజమౌళి విజేతలకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.