News March 17, 2024
WPL: ఆర్సీబీ ఘన విజయం
WPL సీజన్-2 ఫైనల్‌లో ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం సాధించి తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. 114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సోఫీ డివైన్(32), స్మృతి మంధాన(31), ఎల్లిస్ ఫెర్రీ(35*) రాణించారు. ఢిల్లీ బ్యాటర్లలో షెఫాలీ వర్మ(44), మెగ్ లానింగ్(23) మినహా అందరూ విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4, సోఫీ మొలినిక్స్ 3, శోభనా ఆశా 2 వికెట్లు పడగొట్టారు.
Similar News
News December 23, 2024
రేపటి నుంచి సెలవులు
క్రిస్మస్ ఈవ్ సందర్భంగా తెలంగాణలో కొన్ని స్కూళ్లకు రేపు ఆప్షనల్ హాలిడే ఉండనుంది. ఇప్పటికే సంబంధిత పాఠశాలల నుంచి విద్యార్థుల పేరెంట్స్‌కు సమాచారం అందింది. 25, 26న పబ్లిక్ హాలిడేస్ ఉండటంతో ఆయా పాఠశాలలకు వరుసగా 3 రోజులు, మిగతావాటికి 2 రోజులు సెలవులు రానున్నాయి. అటు ఏపీలోనూ రేపు కొన్ని స్కూళ్లకు ఆప్షనల్, 25న పబ్లిక్ హాలిడే, 26న ఆప్షనల్ హాలిడే ఉండనుంది.
News December 23, 2024
విధానం రద్దుతో డ్రాపౌట్స్: UTF
నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేయడంపై తెలంగాణ UTF స్పందించింది. ఈ విధానం రద్దు చేయడం వల్ల స్కూళ్లలో డ్రాపౌట్స్ పెరుగుతాయని, పేదలకు విద్య దూరమవుతుందని అభిప్రాయపడింది. దీని వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
News December 23, 2024
భారత సినీ చరిత్రలోనే తొలి మూవీగా ‘పుష్ప-2’
అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మరో రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన చిత్రంగా నిలిచినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇది రికార్డు అని పేర్కొంది. ఇప్పటివరకు 18 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అయినట్లు వెల్లడించింది. కాగా ఈ సినిమా ఇప్పటికే రూ.1,700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.