News January 20, 2025

SKLM: నేటి నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 20 నుంచి 31వతేదీ వరకు అన్ని మండలాల్లో రోజుకు రెండు పంచాయితీల చొప్పున పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ జేడీ డాక్టర్ కె.రాజ్ గోపాల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి ఈ శిబిరాలు నిర్వహిస్తామని, పశువులకు సాధారణ చికిత్సలు, గర్భకోస వ్యాధులకు పరీక్షలు చేసి మందులు అందిస్తామన్నారు. 

Similar News

News January 15, 2026

శ్రీకాకుళం: బస్సుల్లో టికెట్ల ధర అధికంగా వసూలు చేస్తున్నారా?

image

శ్రీకాకుళం జిల్లాకు వస్తున్న ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రాంతాలకు వెళుతున్న బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి విజయ సారథి చెప్పారు. ఆర్టీజీఎస్ యాప్ సహకారంతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు తనిఖీలు సాగుతాయని వెల్లడించారు. అధిక ఛార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అలా చేస్తే హెల్ప్ లైన్ నంబర్ 9281607001 కు సంప్రదించాలన్నారు.

News January 15, 2026

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మకర సంక్రాంతి సుఖసంతోషాలను కమ్మని అనుభూతులను అందించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.