News March 17, 2024
ఎలుకల మందు సేవించి యువకుడు ఆత్మహత్య

సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఎండీ. సమీర్ (22) శనివారం ఎలుకల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Similar News
News January 15, 2026
ఖమ్మం: వైద్య సేవలకు ఊతం

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా పది మంది ల్యాబ్ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేందర్‌కు నివేదించారు. వీరి రాకతో ల్యాబ్ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి.
News January 14, 2026
UPDATE: ఖమ్మం LIG ఫ్లాట్ల రహదారి సమస్య పరిష్కారం

ఖమ్మం శ్రీరాం నగర్‌లో హౌసింగ్ బోర్డు నిర్మించిన LIG ఫ్లాట్లలో రహదారి సమస్య ఎట్టకేలకు పరిష్కారమైనట్లు హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రమణా రెడ్డి వెల్లడించారు. కాగా రహదారి విషయంలో ఏర్పడిన సమస్య కారణంగా, అనేక మంది దరఖాస్తు చేయడానికి ముందుకు రాలేదని చెప్పారు. సమస్య పరిష్కారం కావడంతో LIG ఫ్లాట్స్‌కు JAN 18 వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, 19న లాటరీ ద్వారా ప్లాట్స్ కేటాయిస్తామని పేర్కొన్నారు.
News January 14, 2026
మధిర, వైరా నియోజకవర్గాలకు రూ.140 కోట్లు మంజూరు

మధిర మున్సిపాలిటీ పరిధిలో డ్రైయిన్స్, వైరా నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేసిందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. రూ.40 కోట్లతో మధిర మున్సిపాలిటీలో డ్రైయిన్ నిర్మాణం, రూ.65 కోట్లతో వైరా నది వెంట వరద నివారణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం, ప్రస్తుతం ఉన్న మురుగునీటి కాలువల ఆధునీకరణ పనులకు రూ.35 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.


