News January 20, 2025
నార్నూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నార్నూర్ మండలంలోని మాలేపూర్ ఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో కుమ్రం మల్కు మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. గుడిహత్నూర్ సూర్యపేట గ్రామంలో నుంచి జంగుబాయి దైవదర్శనానికి వెళ్తున్న గ్రామస్థుల ఐచర్ వ్యాన్ ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా మల్కు మృతిచెందగా.. పలువురు చికిత్స పొందుతున్నారు.
Similar News
News January 20, 2025
రేపు ఆదిలాబాద్ ఆకాశవాణిలో ఫోన్ ఇన్
ADB ఆకాశవాణి కేంద్రంలో మంగళవారం “కీరదోస సాగులో మెళకువలు” గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.వి.మురళీతో ఫోన్‌ఇన్ నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం హెడ్ తెలిపారు. రైతులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆయన సమాధానిలిస్తారని పేర్కొన్నారు. రైతులు మంగళవారం రాత్రి 7.15 నుంచి 7.45 వరకు 08732-295081, 230081 నంబర్లలో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు.
News January 20, 2025
ఇంద్రవెల్లి: ప్రకృతి ప్రేమికులు ఆదివాసులు
ప్రకృతిని, అడవిని దైవంగా భావిస్తూ ఆదివాసులు ప్రత్యేక పూజలు చేస్తారు. నాగోబా మహా జాతర ప్రారంభమవుతున్న వేళ ఆదివాసులు ఇంద్రాయి, నాగోబా, జంగుబాయి దేవతలకు పూజలు చేస్తారు. గంగాజలం తీసుకువెళ్లే మెస్రం వంశీయులు మొదట ఇంద్రాయి దేవతకు పూజలు చేస్తారు. అనంతరం గోదావరి జలాలతో నాగోబాకు పూజలు చేసి జాతరను ప్రారంభిస్తారు. జాతర పూర్తయిన తర్వాత ఆదివాసులు జంగుబాయిని దర్శించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
News January 20, 2025
ఆదిలాబాద్: యువకుడిపై పోక్సో కేసు నమోదు
ఓ యువకుడిపై ADB 1 టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. DSP జీవన్ రెడ్డి వివరాలు.. ఓ కళాశాలలో చదువుతున్న బాలిక (17)తో సుందరయ్యనగర్‌కు చెందిన చౌహాన్ అంకుష్ (23) పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఈనెల 10న ఆమెను HYD తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ తెలుసుకున్నారు. అనంతరం అతడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు.