News January 20, 2025
విజయనగరం మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

మహా కుంభమేళాకు వెళ్లే వారి కోసం విజయనగరం మీదుగా తిరుపతి- బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07107 తిరుపతి- బనారస్ రైళ్లను 2025 ఫిబ్రవరి 8, 15, 22 తేదీలలో నడుపుతున్నామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లు ఏపీలో విజయనగరంతో పాటు రాజమండ్రి, దువ్వాడ, తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News July 6, 2025
భీమా సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్

పీఎం జీవన జ్యోతి, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పధకాల ద్వారా భీమా పొందాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అతి తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ రక్షణ పొందవచ్చన్నారు. భీమా పథకాలపై సచివాలయాల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సామాన్య కుటుంబాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు.
News July 6, 2025
VZM: 2,232 పాఠశాలు.. 2,10,377 మంది విద్యార్థులు

ఈనెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ శనివారం తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలలలోనే నిర్వహించామన్నారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,232 పాఠశాల నుంచి 2,10,377 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి హాజరు కానున్నారని తెలిపారు.
News July 6, 2025
ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. విజయనగరంలో 473, పార్వతీపురంలో 119, బొబ్బిలి 69, సాలూరులో 229, శృంగవరపుకోటలో 47, గజపతినగరంలో 347, చీపురుపల్లిలో 38, కొత్తవలసలో 320, కురుపాంలో 14 కేసులు పరిష్కరించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తెలిపారు. విజయవంతం చేసిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.