News January 20, 2025

ఖోఖో ప్రపంచ కప్‌లో ప్రకాశం కుర్రాడి సత్తా

image

ఢిల్లీలో జరిగిన ఖోఖో ప్రపంచ కప్‌లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. అతనిది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శివారెడ్డి భారత జట్టుని విజేతగా నిలపడంతో ముండ్లమూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Similar News

News March 14, 2025

ఒంగోలులో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

ఒంగోలులో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్‌కు చెందిన సంజీవ కుమార్ ఒంగోలు రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న GRPS పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 13, 2025

భూ ఆక్రమణ కేసుల విచారణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరు తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావులతో కలసి భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూఅక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

News March 13, 2025

ప్రకాశం: సమస్యాత్మకంగా 6 పరీక్షా కేంద్రాలు

image

ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 6 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కొమరోలు గవర్నమెంట్ హైస్కూల్, బెస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల, పెద్దారవీడు మండలం వైడిపాడు, అర్ధవీడు మండలం మాచవరం, రాచర్ల, CSపురం జిల్లా పరిషత్ పాఠశాలలను సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించారు. ఆయా సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

error: Content is protected !!