News March 18, 2024

హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో కన్‌ఫ్యూజన్..!

image

లోక్‌సభ ఎన్నికల ముంగిట HYD, రంగారెడ్డిలోని 3 స్థానాలపై కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఇటీవల INC చేవెళ్ల అభ్యర్థిని తానే అంటూ పట్నం సునీత గ్రౌండ్‌ వర్క్ మొదలుపెట్టారు. కానీ, అనూహ్యంగా రంజిత్ రెడ్డి పేరు తెరమీదకొచ్చింది. సికింద్రాబాద్‌‌ టికెట్ బొంతు రామ్మోహన్‌‌దే అంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తుండగా.. దానం నాగేందర్‌‌‌కు అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ స్థానాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మీ కామెంట్?

Similar News

News April 4, 2025

HYDలో 20 వేల మంది పోలీసులతో బందోబస్తు: CP

image

శ్రీరామనవమి శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. తాజాగా సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు కొనసాగే శోభాయాత్రకు ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP స్పష్టం చేశారు.

News April 4, 2025

సికింద్రాబాద్: రైలులో బాలికకు లైంగిక వేధింపులు

image

సికింద్రాబాద్ రైల్వే PS పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక అర్ధరాత్రి 2 గంటలకు వాష్ రూమ్‌కు వెళ్లింది. ఇది గమనించిన ఓ యువకుడు ఆమెను అనుసరించాడు. బాత్రూంలో అరగంట సేపు బంధించి వీడియోలు తీశాడు. లైంగికంగా వేధించాడు. బాధితురాలు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు రైల్వే టోల్‌ఫ్రీ నంబరు 139కి ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News April 4, 2025

HYD: గర్ల్స్ క్యాబ్ ఎక్కుతున్నారా.. జాగ్రత్త!

image

HYDలో క్యాబ్, ఆటో‌లో ప్రయాణించే యువతులు, మహిళలకు పోలీసులు కీలక సూచన చేశారు. ‘వాహనంలో ఒంటరిగా ప్రయాణం చేస్తే అప్రమత్తంగా ఉండండి. డ్రైవర్ రూట్ మార్చితే వెంటనే ‘Hawk Eye’ యాప్‌లో SOS బటన్ నొక్కండి. దీంతో సన్నిహితులు, పెట్రోలింగ్ పోలీస్, సమీపంలోని PSకు రైడ్ వివరాలు వెళ్తాయి. వెంటనే మిమ్మల్ని సేవ్ చేస్తారు’ అని తెలిపారు. ఇటీవల పహాడీ‌షరీఫ్‌లో యువతిపై కారు డ్రైవర్ అఘాయిత్యం చేశాడు. బీ కేర్ ఫుల్ గర్ల్స్!

error: Content is protected !!