News January 20, 2025

HYD: త్వరలో ఐటీ కారిడార్లలో పాడ్ కార్లు..!

image

మెట్రో స్టేషన్‌ నుంచి నేరుగా కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ సంకల్పించింది. ఈ వ్యవస్థలో భాగంగా పాడ్‌ కార్‌ లేదా పాడ్‌ ట్యాక్సీలను పరిచయం చేసి ప్రత్యేక కారిడార్లలో వాటిని నడిపేందుకు రూ.1,480 కోట్ల అంచనా వ్యయంతో DPRను సిద్ధం చేసినట్లు సమాచారం. నెలాఖరులోగా లేదా ఫిబ్రవరి మొదటి వారంలో డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించి నిధులు కోరనుంది. 

Similar News

News November 9, 2025

జూబ్లీ బైపోల్: ఓటర్లు, పోలింగ్ బూత్‌ల వివరాలు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎల్లుండి జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 7 డివిజన్లు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య: 4,01,365. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటిలో 226 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద రెండంచల భద్రత ఏర్పాటు చేస్తారు. ఉప ఎన్నికలో 58 అభ్యర్థులు(+నోటా) పోటీ చేస్తున్నారు. INC-BRS-BJP మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది.

News November 9, 2025

బస్తీల్లో జూబ్లీహిల్స్ ‘పవర్’!

image

బస్తీలు అని చిన్న చూపు చూడకండి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి అవి ఎదిగాయి. పేరుకే జూబ్లీహిల్స్.. కానీ లోపల మాత్రం పక్కా మాస్. భవంతులు కట్టిన బడాబాబులు కాదు.. గల్లీ ఓటర్లే ఇక్కడ MLAను డిసైడ్ చేస్తారు. కుల రాజకీయం అస్సలే కలిసిరాదు. నియోజకవర్గంలో మైనార్టీలు సింహభాగం(30%) అయితే.. వారు కూడా నివసించేది ఈ బస్తీల్లోనే. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బస్తీలు కింగ్‌మేకర్‌గా మారాయి.

News November 9, 2025

HYD: చివరి రోజు.. అభ్యర్థుల్లో టెన్షన్!

image

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. అసలే ఆదివారం సెలవు. అభ్యర్థులు ఉదయాన్నే ఓటర్ల డోర్లు తడుతున్నారు. ఉన్నది ఒక్కటే రోజు.. ఎల్లుండే పోలింగ్.. ఎవరినైనా మిస్ అయ్యామా? అనే అంతర్మథనంలో పడుతున్నారు. తాయిళాలు మొదలుపెట్టి గెలుపు కోసం INC, BRS, BJP సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తున్నాయి. ఎంత చేసినా సైలెంట్ ఓటింగ్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌ను పెంచుతోంది.