News March 18, 2024

కరీంనగర్: జిల్లాలో నెత్తురోడుతున్న రహదారులు

image

ఉమ్మడి జిల్లాలో రహదారులు నిత్యం రోడ్డు ప్రమాదాలతో నిత్తురోడుతున్నాయి. రోజు ప్రమాదాలలో కొందరు గాయపడుతుండగా, మరికొందరు మరణిస్తున్నారు. శనివారం మెట్పల్లి వద్ద ముగ్గురు మహిళలను గుర్తు తెలియని వాహనం ఢీకొనగా గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ వ్యక్తి మరణించారు. ఆదివారం ఉదయం జగిత్యాల కోరుట్ల ప్రధాన రహదారిపై ఆగిఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో కొండగట్టుకు చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు.

Similar News

News October 19, 2025

కరీంనగర్ డీసీసీ చీఫ్ ఎంపిక.. రేసులో సత్యప్రసన్న!

image

KNR DCC అధ్యక్ష పదవి నియామక ప్రక్రియ వేగవంతమైంది. ఈ పదవి కోసం శనివారం జరిగిన ఇంటర్వ్యూలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాంరెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక MLA, AICC ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్ మన్నె ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. జిల్లాలో పార్టీ బలోపేతానికి సంబంధించిన తన ప్రణాళికలు, అభిప్రాయాలను ఆమె వివరించారు. జిల్లా స్థాయిలో మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేస్తానని తెలిపారు.

News October 19, 2025

కరీంనగర్‌లో 22న జాబ్ మేళా.!

image

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి తిరుపతి రావు తెలిపారు. వరుణ్ మోటార్స్ సంస్థలో ఉన్న 50 పోస్టులకు ITI, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు 20-35 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని అన్నారు. వేతనం రూ.10 వేల నుంచి ప్రారంభమౌతుందని, ఆసక్తి గలవారు 22న పేరు నమోదు చేసుకోవాలన్నారు. 8143865009, 9963177056, 8886619371, 7207659969కు సంప్రదించాలన్నారు.

News October 19, 2025

KNR: వైద్యాధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్‌లో శనివారం జిల్లా వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఈ సమీక్షలో పాల్గొన్నారు. వైద్యాధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, ఆసుపత్రుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.