News January 20, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా కొత్త తేజ మిర్చి ధర రూ.14,700 ధర పలకగా.. 341 రకం మిర్చికి రూ.15,500 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్ మిర్చికి రూ.12,700 ధర పలికిందని రైతులు చెబుతున్నారు.  

Similar News

News January 20, 2025

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలి: కలెక్టర్ ప్రావీణ్య 

image

పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేజీబీవీ నిర్వహణకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వంట సామగ్రిని భద్రపరిచిన స్టోర్ రూమును పరిశీలించారు.

News January 20, 2025

తెల్లవారుజామున నగరంలో వరంగల్ సీపీ ఆకస్మిక తనిఖీలు

image

శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈరోజు తెల్లవారుజామున నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్‌తో పాటు ఏటీయం సెంటర్లను పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్, ఏటీయం సెంటర్లలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే రాత్రి సమయాల్లో పోలీస్ సిబ్బంది పనితీరును గమనించేందుకు సీపీ హన్మకొండ పోలీస్ స్టేషన్ సైతం తనీఖీ చేశారు.

News January 20, 2025

ఈనెల 28న కొత్తకొండ హుండీల లెక్కింపు

image

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు.