News January 20, 2025
జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు
AP: వైఎస్ జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చింది. గతంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఈ కేసులను విచారించగా, 12 ఏళ్లుగా ట్రయల్ అడుగు కూడా ముందుకు కదలలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తరఫు న్యాయవాది వాదించారు. దీంతో జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనానికి ట్రయల్‌ను మార్చింది.
Similar News
News January 20, 2025
ఈ సమయంలో బయటకు రాకండి: డాక్టర్లు
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మధ్యాహ్నం ఎండ, వేడి ఎక్కువగా ఉంటే.. ఉదయం, రాత్రి విపరీతమైన చలి ఉంటోంది. పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రతల్లో తేడా 18 డిగ్రీల వరకు ఉంటోంది. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న అత్యల్పంగా 6.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.
News January 20, 2025
ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు: లోకేశ్
పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం ఉందని మంత్రి నారా లోకేశ్ స్విస్ పారిశ్రామికవేత్తలకు తెలిపారు. జ్యూరిచ్‌లో వారితో భేటీ అయిన లోకేశ్, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తాము ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ, విశాలమైన రోడ్లు, తీర ప్రాంతం, నౌకాశ్రయాలు ఉన్నాయని చెప్పారు. త్వరలో మరిన్ని పోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు.
News January 20, 2025
Blinkit వల్ల Zomato షేర్లు క్రాష్.. ఎందుకంటే!
Q3 ఫలితాలు నిరాశపరచడంతో జొమాటో షేర్లు నేడు విలవిల్లాడాయి. ఇంట్రాడేలో ఏకంగా 7% మేర క్రాష్ అయ్యాయి. బ్లింకిట్ స్టోర్ల పెంపుకోసం అధికంగా ఖర్చు చేయడంతో నెట్ ప్రాఫిట్ 66% తగ్గి ₹176CR నుంచి ₹59CRగా నమోదైంది. ఇక రెవెన్యూ ₹4799CR నుంచి ₹5405CRకు చేరుకుంది. ఉదయం ₹251వద్ద మొదలైన షేర్లు ₹254 వద్ద గరిష్ఠాన్ని చేరాయి. ఫలితాలు రాగానే ₹228 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. చివరికి రూ.239 వద్ద క్లోజయ్యాయి.