News March 18, 2024

స్పందన కార్యక్రమం రద్దు: విశాఖ కలెక్టర్

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం స్పందన కార్యక్రమం జరగదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని ప్రజలు, ఫిర్యాదుదారులు గమనించాలని అన్నారు.

Similar News

News January 10, 2026

విశాఖ జూ పార్క్‌లో స్వాన్, ఈము పిల్లల పునరుత్పత్తి

image

విశాఖ జూ పార్కులో కొన్ని వారాలుగా స్వాన్, ఈము గుడ్లను కృత్రిమంగా ఇంక్యూబేటర్‌లో పెట్టారు. శనివారం ఈ గుడ్ల నుంచి 6 ఈము పిల్లలు, ఒక బ్లాక్ స్వాన్ పిల్ల వచ్చినట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. అంతేకాకుండా రెండు సాంబార్ జింకలు, రెండు నీలిగాయి, మూడు బ్లాక్ బక్స్ కూడా జన్మించినట్లు చెప్పారు. విశాఖ జూ పార్కులో వన్యప్రాణుల పరిరక్షణకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.

News January 10, 2026

పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్‌లో 17న తుక్కు వేలం

image

విశాఖలో పోలీస్ స్టేషన్లు, విభాగాలు నుంచి సేకరించిన నిరుపయోగమైన ఇనుము, అల్యూమినియం, చెక్క, ప్లాస్టిక్ వస్తువులు జనవరి 17న వేలం వేయనున్నట్లు విశాఖ సీపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆరోజు ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు జనవరి 12 ఉదయం 10 నుంచి వస్తువులను చూసుకొనవచ్చన్నారు. వేలంలో పాల్గొనే వారు పోలీస్ బ్యారెక్స్, కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.

News January 10, 2026

విశాఖ: సంక్రాంతి వేళ రైతు బజార్లకు సెలవు రద్దు

image

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రైతు బజార్లకు ఉండే వారాంతపు సెలవులను రద్దు చేస్తున్నట్లు DD శ్రీనివాస్ కిరణ్ తెలిపారు. ఈ మంగళవారం, బుధవారం కూడా రైతు బజార్లు యథావిధిగా తెరిచే ఉంటాయని వెల్లడించారు. పండుగకు అవసరమైన కూరగాయలు, సరుకుల కొనుగోలు కోసం ప్రజలు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.