News January 20, 2025

BIG BREAKING: కోల్‌కతా హత్యాచార దోషికి శిక్ష ఖరారు

image

దేశంలో సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. BNS 64, 66, 103/1 ప్రకారం ఖైదుతో పాటు, ₹50 వేల జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. 2024 AUG 9న RG Kar మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి ఉరే సరైన నిర్ణయమని డిమాండ్లు వచ్చాయి.

Similar News

News November 7, 2025

పెద్ది నుంచి లిరికల్ కాదు.. వీడియో సాంగ్

image

టాలీవుడ్ ప్రేక్షకులను డైరెక్టర్ బుచ్చిబాబు ‘చికిరి చికిరి’ అంటూ ఊరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఫుల్ సాంగ్‌ను ఇవాళ ఉదయం 11.07కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అందరూ అనుకున్నట్లు లిరికల్ సాంగ్‌ను కాకుండా వీడియో సాంగ్‌నే రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పెద్ది చిత్రం నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ SMలో పేర్కొంది.

News November 7, 2025

నవంబర్ 7: చరిత్రలో ఈరోజు

image

*1858: స్వాతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ జననం
*1888: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి, భారత రత్న గ్రహీత సి.వి.రామన్(ఫొటోలో) జననం
*1900: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎంపీ ఎన్‌జీ రంగా జననం
*1954: నటుడు కమల్ హాసన్ జననం
*1971: డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ పుట్టినరోజు
*1981: హీరోయిన్ అనుష్క శెట్టి బర్త్‌డే
*జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం

News November 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.