News January 20, 2025
ఏలూరు: ప్రియుడి ఇంటి ముందు ధర్నా

ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమె వివరాల ప్రకారం.. బుట్టాయిగూడెం మండలం అరుంధతి కాలనీకి చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమ వ్యవహారం నడిపించాడు. పెళ్లి చేసుకోమని అడిగితే దుర్భాషలాడి దాడి చేశారని.. తనకు న్యాయం చేయాలని యువతి కోరుతోంది.
Similar News
News January 17, 2026
ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు: కలెక్టర్

జిల్లాలోని అన్ని గ్రామాలలో ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహణ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జనవరి 19 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశుపోషకులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ నిర్వహించి, పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.
News January 16, 2026
భీమవరంలో రైల్వే ట్రాక్‌పై బాలిక మృతదేహం కలకలం

భీమవరం-ఉండి రహదారిలోని రైల్వే గేటు సమీపంలో ట్రాక్‌పై శుక్రవారం ఓ గుర్తు తెలియని బాలిక(3) మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. రైల్వే ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఏదైనా గుర్తు తెలియని రైలు ఢీకొనడం వల్లే ఆ చిన్నారి మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతి చెందిన బాలిక గురించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే భీమవరం రైల్వే గవర్నమెంట్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.
News January 14, 2026
ఖాకీపై ఖద్దరు విజయం.. జిల్లాలో పందెం హోరు!

ఉమ్మడి ప.గో. జిల్లాలో కోడిపందేలకు లైన్ క్లియర్ అయింది. పోలీసుల ఆంక్షలు అమలు కాకపోవడంతో ‘ఖాకీపై ఖద్దరు’ విజయం సాధించినట్లయ్యింది. బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రధాన బరుల వద్ద పందేలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పందెం రాయుళ్లు భారీగా తరలిరావడంతో బరుల వద్ద కోలాహలం నెలకొంది. వచ్చే మూడు రోజుల పాటు ఈ పందెం జాతర కొనసాగనుండగా.. సంప్రదాయం పేరిట జూదం జోరందుకోవడంతో పల్లెలన్నీ పందెం సెగతో ఊగిపోతున్నాయి.


