News January 20, 2025
లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ప్రతిపాదనలు.. హైకమాండ్ సీరియస్

AP: నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు చేస్తున్న డిమాండ్లపై అధిష్ఠానం సీరియస్ అయింది. ఈ అంశంపై పార్టీ నేతలు ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించింది. ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది. కూటమి నేతలు చర్చించుకున్నాకే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని తేల్చి చెప్పింది.
Similar News
News September 16, 2025
షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు: BCCI

పాక్ క్రికెటర్లకు భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై <<17723523>>వివాదం<<>> తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై BCCI సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ‘ప్రత్యర్థులతో షేక్ హ్యాండ్‌కు సంబంధించి రూల్ బుక్‌లో ఎలాంటి స్పెసిఫికేషన్ లేదు. అది ఒక గుడ్‌విల్ జెశ్చర్ మాత్రమే. చట్టం కాదు. అలాంటి రూల్ లేనప్పుడు సత్సంబంధాలు లేని ప్రత్యర్థికి టీమ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.
News September 16, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.146.3 కోట్లు రిలీజ్

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటివరకు రూ.1,435 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. నిన్న 13,841 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.146.30 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. 1.29 లక్షల ఇళ్లు పురోగతిలో ఉన్నాయన్నారు.
News September 16, 2025
నేడు ముఖ్య నేతలతో జగన్ సమావేశం

AP: వైసీపీ చీఫ్ జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లి రానున్నారు. ఉదయం 11.55గంటలకు గన్నవరం చేరుకోనున్న ఆయన, మధ్యాహ్నం 12.10కి తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తాజా రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీలు, పంటల గిట్టుబాటు ధరలపై ప్రభుత్వాన్ని జగన్ నిలదీస్తోన్న విషయం తెలిసిందే.