News March 18, 2024

ఎన్నికల నియమావళి ఉల్లంగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అందరూ కచ్చితంగా పాటించాలని ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు.
జిల్లాలో ప్రశాంత, పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు. ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులు కూడా సభలు ,సమావేశాలకు ముందస్తుగా అనుమతులు పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News September 29, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగు పాటు.. భార్య, భర్త మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గంగంపల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పిడుగు పాటుకు గురై భార్య, భర్తలు దాశరథి నాయక్, దేవి బాయి మృతిచెందారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పిడుగు పడటంతో వారు అక్కడిక్కడే మృతిచెందారు.

News September 29, 2024

అనంత: భార్య గొంతు కోసి భర్త పరార్.. మృతి

image

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటన గుమ్మగట్ట మండలంలోని కలుగోడులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కలుగోడుకు చెందిన బోయజ్యోతి(26)ని గలగల గ్రామానికి చెందిన వన్నూరు స్వామికి ఇచ్చి 8 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ఇటీవల భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది. తిరిగి రాలేదని భర్త ఈ దారుణానికి వడిగట్టాడు.

News September 29, 2024

అనంత: హైవేపై రోడ్డు ప్రమాదం.. 10 మంది కూలీలకు గాయాలు

image

గార్లదిన్నె మండలం కలగాసపల్లి క్రాస్ వద్ద హైవేపై ఆదివారం అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటకు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని బెంగళూరు నుంచి HYD వెళ్తున్న ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీకొంది. ప్రమాదంలో 10మంది కూలీలు, బస్సు కండక్టర్‌ గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కూలీలంతా మహబూబ్ నగర్‌ వాసులు.