News January 20, 2025

రైతు ఆత్మహత్యలపై BRS అధ్యయన కమిటీ

image

TG: రైతు ఆత్మహత్యలపై అధ్యయనానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు BRS ప్రకటించింది. ఈ కమిటీ సభ్యులు 2 వారాల పాటు అన్ని జిల్లాల్లో పర్యటించి రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ రంగ పరిస్థితులపై అధ్యయనం చేస్తారని తెలిపింది. అధ్యయనం అనంతరం నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని, బడ్జెట్ సమావేశాల్లో రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని KTR పేర్కొన్నారు.

Similar News

News January 25, 2026

ఇన్‌స్టా ‘స్మృతి’లను చెరిపేసిన పలాశ్ ముచ్చల్

image

స్మృతి మంధాన మాజీ లవర్ పలాశ్ ముచ్చల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో ఉన్న అన్ని ఫొటోలను డిలీట్ చేశారు. వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. నవంబర్‌లో జరగాల్సిన పెళ్లి క్యాన్సిల్ అవ్వగా తాజా చర్యతో వారి బంధం పర్మనెంట్‌గా ముగిసినట్లు స్పష్టమవుతోంది. పలాశ్ ఆర్థికంగా మోసం చేశారని, పెళ్లి వేడుకల్లో ఓ <<18940645>>అమ్మాయితో అడ్డంగా<<>> దొరికిపోయారని విజ్ఞాన్ మానే అనే వ్యక్తి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.

News January 25, 2026

బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

image

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.

News January 25, 2026

CMను కాపాడేందుకే భట్టి అవాస్తవాలు: హరీశ్ రావు

image

TG: సింగరేణి టెండర్లపై Dy.CM <<18943021>>భట్టి విక్రమార్క<<>> చెప్పినవన్నీ అవాస్తవాలని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. CM రేవంత్‌ను ‘స్కామ్’ నుంచి కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో లేని సైట్ విజిట్ నిబంధనను తమ వారికి లబ్ధి చేకూర్చడానికే 2025లో తెచ్చారన్నారు. టెండర్ల ప్రక్రియలో నిపుణుల సంస్థలను పక్కన పెట్టి సింగరేణికి నష్టం కలిగించారని, లబ్ధిదారులెవరో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.