News March 18, 2024
విశ్వవిద్యాలయం అభివృద్ధి ధ్యేయం: వైస్ ఛాన్స్‌లర్

కర్నూలు లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఉన్న రాయలసీమ వర్సిటీని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని వైస్ ఛాన్స్‌లర్ సుధీర్ ప్రేమ్ కుమార్ ప్రకటించారు. వర్సిటీలో చదివే విద్యార్థులకు తప్పనిసరిగా ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి త్వరలో కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News October 28, 2025
కర్నూలు: బస్సు ప్రమాదం కేసులో డ్రైవర్ అరెస్ట్.!

కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో 24వ తేదీన జరిగిన బస్సు ప్రమాదం కేసులో వి.కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా పత్తికొండ DSP వెంకట్రామయ్య పర్యవేక్షణలో విచారణ జరిపి, నిందితుడిని మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా SP విక్రాంత్ పాటిల్ తెలిపారు.
News October 28, 2025
కర్నూలు: ‘ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు’

ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసినా ఉపేక్షించమని మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత కలవారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, సాయి సుధీర్, రేణుక దేవి, సీఐ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
News October 28, 2025
కర్నూలు: గృహ నిర్మాణంపై చర్చించిన హౌసింగ్ డైరెక్టర్

కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన ఆరేకల్ రామకృష్ణ మంగళవారం హౌసింగ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరూ జిల్లా గృహ నిర్మాణ ప్రగతిపై, అలాగే 2014–2019 మధ్య పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ బిల్లుల పరిష్కారం వంటి అంశాలపై విశదంగా చర్చించారు.


