News March 18, 2024

శ్రీకాకుళం: కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం రద్దు

image

నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు డీఆర్ఓ ఎం.గణపతి రావు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న వినతుల స్వీకరణ కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత తదుపరి తేదీ ప్రకటిస్తామని తెలిపారు.

Similar News

News February 4, 2026

SKLM: నేడు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్

image

శ్రీకాకుళం పోలీస్ అధికారులకు సంబంధించి వార్షిక జిల్లాస్థాయి స్పోర్ట్స్ గేమ్స్ కార్యక్రమం ఈనెల 4న శ్రీకాకుళం మండలం తండేవలస పోలీస్ శిక్షణ కేంద్రం గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు ఎస్పీ కేవీ.మహేశ్వర్ రెడ్డి మంగళవారం తెలిపారు. పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వాన్ని క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి పాల్గొంటారన్నారు.

News February 3, 2026

శ్రీముఖలింగం: శివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష

image

జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వరుని క్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా అధికారులతో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమీక్షించారు. మంగళవారం మధ్యాహ్నం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో పాటు దేవాదాయ శాఖ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News February 3, 2026

ఆక్వా రంగంపై అమెరికా నిర్ణయం స్వాగతిస్తున్నాం: అచ్చెన్నాయుడు

image

అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం తెలిపారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కింద ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం లభిస్తుందన్నారు. దీనివలన నిలిచిపోయిన కొత్త ఆర్డర్లకు మంచి అవకాశం ఉంటుందన్నారు.