News January 20, 2025
జియో కస్టమర్లకు షాక్.. ఏకంగా రూ.100 పెంపు
రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాక్ ఇచ్చింది. రూ.199 ప్లాన్‌ను ఒక్కసారిగా రూ.100 పెంచి, ఇకపై రూ.299 అని జియో పేర్కొంది. పెంచిన ధరలు JAN 23 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.199 ప్లాన్ కస్టమర్లు ఆటోమెటిక్‌గా రూ.299 ప్లాన్‌కు బదిలీ అవుతారు. ఇందులో అన్లిమిటెడ్ కాల్స్, నెలకు 25GB డేటా వస్తాయి. ఇక కొత్తగా చేరే కస్టమర్లు రూ.299కి బదులు రూ.349తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
Similar News
News January 21, 2025
కోర్టు తీర్పుపై మమతా బెనర్జీ అసహనం
R.G.Kar ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో దోషి సంజయ్ రాయ్‌కు జీవితఖైదు విధించటం పట్ల బెంగాల్ CM మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసు ‘అత్యంత అరుదు’ కాదన్న కోర్టు తీర్పు షాక్‌కు గురి చేసిందని చెప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ మెుదటి నుంచి దోషికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు మమత ట్వీట్ చేశారు.
News January 21, 2025
భారత్ నుంచి బ్రిటిషర్లు దోచుకున్న సంపద 64 ట్రిలియన్ డాలర్స్!
మన దేశం నుంచి ఎంత సంపద బ్రిటిషర్లకు చేరిందో తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. 1765 నుంచి 1900 సం. మధ్యలో 64.2 ట్రిలియన్ డాలర్లు భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లాయని Oxfam గ్రూప్ తెలిపింది. ఇందులో సగం అంటే 33.8 ట్రి.డా. 10% ధనవంతులే దోచుకున్నారని పేర్కొంది. ఈ డబ్బును లండన్ నగరమంతా 50 పౌండ్ల నోట్లతో పరిచినా ఇంకా 4 రెట్ల కరెన్సీ మిగిలి ఉంటుందని వివరించింది. 1 ట్రిలియన్ డాలర్ అంటే లక్ష కోట్లతో సమానం.
News January 21, 2025
గుమ్మడి గింజలతో ఎంతో ఆరోగ్యం
గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ప్రోటీన్, ఫైబర్, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. పండ్లు, ఆకుకూర సలాడ్లలో గుమ్మడికాయ గింజలను కలిపి తింటే ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. అలాగే జీర్ణక్రియ మెరుగవ్వడానికీ ఉపయోగపడతాయి. వీటిని రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే చర్మం నిగనిగలాడుతుందని వైద్యులు చెబుతున్నారు.