News January 21, 2025

NZB: నేటి నుండి 24 వరకు ప్రజా పాలన వార్డు సభలు

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఈ నెల 21 నుంచి 24 వరకు వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నగరంలోని 60 డివిజన్లలో 7 బృందాలు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు దశల వారీగా ఈ సభలు నిర్వహిస్తారని కమిషనర్ చెప్పారు. ఇందులో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 21, 2026

NZB: నకిలీ విదేశీ ఉద్యోగాల కేసులో నిందితుడి అరెస్టు

image

నకిలీ విదేశీ ఉద్యోగాల కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు NZB సైబర్ క్రైమ్ ACP వై. వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిందితుడు టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తి మాటలను నమ్మి, విదేశాల్లో అధిక జీతంతో ఉద్యోగాలు ఉన్నాయంటూ మోసాగిస్తున్నాడన్నారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశామన్నారు.

News January 21, 2026

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు కమ్మర్‌పల్లి విద్యార్థినులు

image

కమ్మర్‌పల్లి ZPHS విద్యార్థినులు క్రీడల్లో సత్తా చాటారు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్-17 పోటీలకు ఈ పాఠశాలకు చెందిన భవాని, వర్షిత్ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సాయన్న, PD వేముల నాగభూషణం తెలిపారు. మినీ స్టేడియంలో జరిగిన ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన వీరు, త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.

News January 21, 2026

NZB: పోలీస్ అధికారులతో CP సమీక్ష

image

నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ అధికారులంతా బాధ్యతగా పని చేయాలని సూచించారు. అలాగే సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని ఆదేశించారు. పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ACP రాజా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.