News January 21, 2025
అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలి: ప్రకాశం కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లో మీ కోసం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో 302 అర్జీలు వచ్చాయన్నారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News October 31, 2025
నవంబర్ 30 వరకు యాక్ట్ 30 అమలు: DSP

ప్రకాశం జిల్లాలో నవంబర్ 1 నుంచి 30 వరకు యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఒంగోలు DSP రాయపాటి శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
News October 31, 2025
ఒంగోలులో కారు ఢీకొని వ్యక్తి మృతి

ఒంగోలులోని త్రోవగుంట బృందావనం కల్యాణ మండపం వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు కర్నాటి వెంకటసుబ్బారెడ్డిగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన కోణపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 31, 2025
ప్రకాశం జిల్లాలో నేడు పాఠశాలలు పునః ప్రారంభం

తుఫాన్ ప్రభావం తగ్గడంతో నేటి నుంచి యధావిధిగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వరుసగా 4 రోజులు తుఫాను సెలవుల అనంతరం నేడు బడిగంట మోగనుంది. ఈ దశలో విద్యార్థుల భద్రతకోసం ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని DEO కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల పరిసరాల్లో చెట్ల కొమ్మలు, కరెంట్ వైర్లు, తడిసిన గోడలు వంటి అంశాలను పరిశీలించి విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.


