News March 18, 2024

చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా చర్యలు: కలెక్టర్

image

చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా చర్యలు చేపట్టి విస్తృత తనిఖీలు నిర్వహించాలని, నగదు, మద్యం రవాణాను నియంత్రించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ అన్నారు. కలెక్టర్‌, ఆదివారం పోలీసు కమిషనర్‌ సునీల్ దత్‌తో కలిసి ఇల్లందు రోడ్, ఎన్ఎస్పీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది విధులు నిర్వహణ, ఎన్ని వాహనాలు తనిఖీ చేసింది అడిగి తెలుసుకున్నారు.

Similar News

News July 3, 2024

కొత్త చట్టాలతో బాధితులకు న్యాయం: సీపీ

image

దేశవ్యాప్తంగా జులై 1నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా సీపీ సునీల్ దత్ వెల్లడించారు. బాధితుడు ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ – మెయిల్‌ ఇతర సామాజిక మాధ్యమాలు వేటి ద్వారానైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు అపోహలకు తావివ్వకుండా కొత్త చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.

News July 3, 2024

రైతు ఆత్మహత్య ఘటన.. పదిమందిపై కేసు నమోదు

image

తన పొలాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన <<13548972>>రైతు బోజడ్ల ప్రభాకర్‌ సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతుడి తండ్రి వీరభద్రయ్య ఫిర్యాదు మేరకు ఖానాపురం హవేలి పోలీసు స్టేషన్‌లో పదిమందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాశ్‌ వివరించారు.

News July 3, 2024

పదేళ్లలో BRS ప్రభుత్వం యువతకు ఏం చేసింది:పొంగులేటి

image

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని 6 నెలలు అయిందన్నారు. రైతులకు రుణమాఫీ కోసం శ్రీకారం చుట్టామని, ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. యువతను ప్రతిపక్షం రెచ్చగొడుతుందని, పదేళ్ల BRS ప్రభుత్వం యువతకు ఏం చేసిందని ప్రశ్నించారు.