News January 21, 2025

KMR: నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవు: SP

image

నేరాల‌కు పాల్ప‌డితే జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ హెచ్చ‌రించారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో నమోదైన ఒక కేసులో సోమవారం ఇద్దరినీ కోర్టు ముందు హాజరు పరిచామన్నారు. ఒకరికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష , రూ.4 వేల జరిమానా, మరొకరికి ఏడాది జైలు శిక్ష రూ.4 వేల జరిమానా విధిస్తూ.. జిల్లా జడ్జి వరప్రసాద్ తీర్పు విధించినట్లు ఆమె తెలిపారు.

Similar News

News November 11, 2025

పైనాపిల్ కాలనీలో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన

image

జీవీఎంసీ 13వ వార్డు పైనాపిల్ కాలనీలో పరిశ్రమల ఉపాధి కల్పనలో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రూ.7.3 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రతీ ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.

News November 11, 2025

పాపం.. ప్రశాంత్ కిశోర్

image

దేశంలోని అనేక పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్‌ స్ట్రాటజీలు సొంత రాష్ట్రంలో తన పార్టీకి మాత్రం ఉపయోగపడలేదు. ‘జన్ సురాజ్’ ద్వారా బిహార్ గతిని మారుస్తానంటూ చేసిన ఆయన ప్రచారాన్ని ప్రజలెవరూ పట్టించుకోలేదు. ఇవాళ వెలువడిన అనేక ఎగ్జిట్ పోల్స్‌.. PK పార్టీకి సింగిల్ డిజిట్ కూడా కష్టమేనని తేల్చాయి. అనేక పార్టీలకు అధికారం తెచ్చానన్న ఆయన మాత్రం గెలుపు దరిదాపుల్లోకీ రాలేకపోయారు.

News November 11, 2025

జూబ్లీ పల్స్: ఎగ్జిట్ పోల్స్‌లో BJP డిపాజిట్ గల్లంతు!

image

జూబ్లీహిల్స్ ఎగ్జిట్‌ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు INC వైపు మొగ్గు చూపాయి. 2వ స్థానంలో BRS నిలుస్తుందని అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేసిన BJPకి కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నాయి. కీలకమైన సర్వేల్లోనూ కమలం కనీసం 10శాతం ఓటింగ్ రాబడుతుందని చెప్పలేకపోయాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్‌ను SMలో పెడుతూ BJP కీలక నేతల మీద ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.