News March 18, 2024
PERRY: బిగ్ గేమ్ ఛేంజర్

ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ ప్రతిభతో ఆ జట్టు కప్ కొట్టింది. టోర్నీలో ఆమె మొత్తం 347 పరుగులు బాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచారు. అలాగే బౌలింగ్‌లోనూ అదరగొట్టారు. టోర్నీలో 7 వికెట్లు కూడా పడగొట్టారు. ముంబైపై 6 వికెట్లు తీసి డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా పెర్రీ నిలిచారు. ఫైనల్లో కూడా తన స్వభావానికి వ్యతిరేకంగా ఆడి జట్టును గెలిపించారు.
Similar News
News March 31, 2025
‘ghibli’ ట్రెండ్

దేశంలో ఇప్పుడిదే నడుస్తోంది. ఎవరి SM పేజీలు చూసినా ‘ghibli’ ఎడిటెడ్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్‌లో ఈ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. మనవాళ్ల వాడకం ఎలా ఉందంటే.. ‘ghibli’ వినియోగాన్ని తగ్గించండి మహాప్రభో అంటూ ఏకంగా Open AI CEO ఆల్ట్‌మనే ప్రాధేయపడుతున్నారు. తమ సిబ్బంది నిద్ర లేకుండా పనిచేస్తున్నారని చెబుతున్నారు. మరి మీరూ ‘ghibli’ ట్రెండ్‌లో జాయిన్ అయ్యారా?
News March 31, 2025
వేసవిలో ఇలా చేయండి..

వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. వివిధ కారణాలతో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 8 గ్లాసుల వాటర్ తాగడం, దోసకాయ, పుచ్చకాయ తినడం, జ్యూస్‌లు తాగడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. దాహం వేయకున్నా తరచుగా నీరు తాగాలని చెబుతున్నారు. చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన డ్రింక్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.
News March 31, 2025
నిర్మాత ముళ్లపూడి కన్నుమూత

టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయన దివంగత ఈవీవీ సత్యనారాయణకు దగ్గరి బంధువు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలను ముళ్లపూడి నిర్మించారు.