News January 21, 2025
కుంభమేళాలో 12లక్షల తాత్కాలిక ఉద్యోగాలు!
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాలో 12లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ NLB సర్వీసెస్ అంచనా వేసింది. పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే సుమారు 4.5లక్షల మందికి ఉపాధి లభించవచ్చని తెలిపింది. హోటల్ స్టాఫ్, టూర్ గైడ్, పోర్టర్లు, ట్రావెల్ కన్సల్టెంట్లు, ఈవెంట్ కోఆర్డినేటర్లు, రవాణా, వైద్య శిబిరాల్లో లక్షల మందికి పని దొరికిందని చెప్పింది.
Similar News
News January 21, 2025
Stock Markets: రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్
గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 76942 (-130), నిఫ్టీ 23,346 (5) వద్ద కొనసాగుతున్నాయి. BRICS దేశాలపై 100% టారిఫ్ విధిస్తానని ట్రంప్ చెప్పడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, O&G షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. BPCL, APOLLOHOSP టాప్ గెయినర్స్.
News January 21, 2025
ఫిబ్రవరిలోనే సర్పంచ్ ఎన్నికలు?
TG: సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై త్వరలో ప్రభుత్వానికి అందే నివేదికను అసెంబ్లీలో ఆమోదించాలని ఆలోచిస్తోంది. ఫిబ్రవరిలో నిర్వహించాల్సి వస్తే 15-20 రోజుల్లో ఎలక్షన్స్ పూర్తి చేయనుంది. మార్చిలో ఇంటర్, ఆ తర్వాత టెన్త్ పరీక్షలతో ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది అవుతుంది. ఫిబ్రవరి కాకుంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.
News January 21, 2025
ఇంటర్ ‘ప్రాక్టికల్స్’ ల్యాబ్‌లో సీసీ కెమెరాలు: బోర్డు
TG: ఫిబ్రవరి 3 నుంచి నిర్వహించనున్న ఇంటర్ ప్రాక్టికల్స్‌పై కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక సూచనలు చేసింది. ప్రతి ల్యాబ్‌లో 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. వైఫై కనెక్షన్, ఆడియో రికార్డింగ్ సౌకర్యం కూడా కల్పించాలన్నారు. ప్రాక్టికల్ సెంటర్‌లో కంప్యూటర్, ప్రింటర్ అందుబాటులో ఉంచాలని, ల్యాబ్ ఫొటోలు, ఫ్యాకల్టీ డిక్లరేషన్ వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.