News January 21, 2025

ప్రజలు వాటిని నమ్మకండి: ప.గో కలెక్టర్

image

ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. ‘ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే కలెక్టర్ పేరిట ప్రకటన విడుదల చేస్తాం. వేరే వారి పేరుతో వచ్చే ప్రకటనలను నమ్మి ప్రజలు మోసపోవద్దు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను గందరగోళం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’ అని కలెక్టర్ హెచ్చరించారు.

Similar News

News January 20, 2026

ఉండిలో జంట మృతదేహాల కలకలం

image

ఉండిలో జంట మృతదేహాల లభ్యం కావడం కలకలం రేపుతోంది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో సుబ్బారావు అనే వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, మంగళవారం నిమ్మలపేటలో విజయ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వరుసగా రెండు మృతదేహాలు బయటపడటంతో ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.

News January 20, 2026

కూల్ డ్రింక్ తాగిన బాలుడి మృతి.. UPDATE

image

<<18903335>>ఎలుకల మందు కలిపిన కూల్ డ్రింక్<<>> తాగిన భీమవరం బలుసుమూడి ఉండే మాన్యం మహారుద్ర కాంత్ అనే బాలుడు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు భీమవరం వన్ టౌన్ SI రామారావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి నుంచి వలస వచ్చిన సుబ్బారావు కుటుంబం భీమవరంలో అద్దెకు ఉంటోంది.

News January 19, 2026

ప.గో: హీరో నవీన్ పోలిశెట్టి సందడి

image

ఉమ్మడి ప.గో. జిల్లా ఏలూరులో ఆదివారం ‘అనగనగా ఒక రాజు’ మూవీ టీమ్ సందడి చేసింది. చిత్రం విజయోత్సవ సంబరాల్లో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షీ చౌదరి ఏలూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా పడమర వీధి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సినిమా ప్రదర్శన అవుతున్న థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కాసేపు సరదాగా గడిపారు.