News January 21, 2025
మరో వారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరో వారంపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో టెంపరేచర్ 15°C కంటే తక్కువగా నమోదవుతుండటంతో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News January 21, 2025
ట్రంప్ షాక్: బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రద్దు
డొనాల్డ్ ట్రంప్ అనుకున్నదే చేశారు. అమెరికాలో జన్మత: లభించే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్‌ను సవరించి వందేళ్లుగా కొనసాగుతున్న విధానాన్ని రద్దు చేశారు. ఇకపై చట్టబద్ధంగా USలో ఉంటున్న వారు జన్మనిచ్చే పిల్లలకే ఈ హక్కు లభిస్తుంది. అక్రమ వలసదారుల పిల్లలకు వర్తించదు. చాలామంది భారతీయులు విజిటింగ్‌కు వెళ్లి అక్కడ పిల్లలకు జన్మనిచ్చే సంగతి తెలిసిందే.
News January 21, 2025
తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నారు. తన భార్య బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన ‘మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో అందరూ కిరణ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా తాను ప్రేమించిన హీరోయిన్ రహస్య గోరక్‌ను కిరణ్ గత ఆగస్టులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
News January 21, 2025
Stock Markets: రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్
గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 76942 (-130), నిఫ్టీ 23,346 (5) వద్ద కొనసాగుతున్నాయి. BRICS దేశాలపై 100% టారిఫ్ విధిస్తానని ట్రంప్ చెప్పడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, O&G షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. BPCL, APOLLOHOSP టాప్ గెయినర్స్.