News January 21, 2025
విచారణ కమిటీ ముందు హాజరైన కొలికపూడి
తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాస్ సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని, పద్ధతి మార్చుకోవాలని కమిటీ హెచ్చరించినట్లు తెలస్తుంది. పార్టీకి చెడ్డపేరు వస్తుందని, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. కాగా విచారణ నివేదికను కమిటీ అధిష్ఠానానికి పంపనుంది.
Similar News
News January 21, 2025
వీరులపాడు: బైక్ అదుపు తప్పి యువకుడు మృతి
వీరులపాడు మండల పరిధిలోని వెల్లంకి గ్రామంలో సోమవారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన కంచె సంతోష్ మెహతాగా గుర్తించారు. తమకు అండగా ఆసరాగా ఉంటాడనే కొడుకు మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 21, 2025
పమిడిముక్కల: రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి
పమిడిముక్కలలో నిన్న జరిగిన ప్రమాదంలో కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్రం(23), ముక్త దుర్గ బాబు(24)లు మృతి చెందిన విషయం తెలిసిందే. నిమ్స్‌చంద్ర తండ్రి ఆటో డ్రైవర్, తల్లి అంగన్ వాడీ కార్యకర్త. కిర్లంపూడికి చెందిన ముక్తదుర్గసాయి తమ్ముడు 10 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పెద్ద కుమారుడి మరణంతో తల్లిదండ్రులు ముత్తా పెద్దకాపు, సరస్వతిల విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
News January 21, 2025
ఎస్పీని కలిసిన అవనిగడ్డ నూతన డీఎస్పీ విద్యశ్రీ
అవనిగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన తాళ్లూరి విద్యశ్రీ సోమవారం కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర రావును మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి డీఎస్పీ పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అవనిగడ్డ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి సూచించారు.