News January 21, 2025
NLGలో కోమటిరెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి

NLGలో సోమవారం అంతా పొలిటికల్ హైడ్రామా నడిచింది. BRS మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారపక్షం ధర్నాను అడ్డుకుంటుందని MLA జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు అథమ స్థాయికి దిగజారాయని మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ చేశారు. పథకాలను డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టారన్నారు. వీరి వ్యాఖ్యలపై మీ కామెంట్.
Similar News
News December 7, 2025
మిర్యాలగూడ డివిజన్ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

నల్గొండ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మిర్యాలగూడ డివిజన్‌లో విధులు నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ను ఆదివారం జిల్లా పరిశీలకురాలు కొర్ర లక్ష్మి పర్యవేక్షణలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఛాంబర్‌లో నిర్వహించారు. డివిజన్‌లోని పది మండలాల్లో 2,418 పోలింగ్ కేంద్రాలకు సరిగ్గా 2,418 బృందాలను కేటాయించారు.
News December 7, 2025
NLG: స్థానిక పోరు.. కూలీలు లేరు..!

స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం నల్గొండ జిల్లాలో జోరందుకుంది. అభ్యర్థులు, వారి బంధువులు, సమర్థకులు ప్రచారంలో నిమగ్నం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత తీవ్రమైంది. ఫలితంగా, ప్రస్తుతం యాసంగి సాగు పనులు చేపడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరకక పోవడంతో పొలాల్లో పనులు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News December 7, 2025
నల్గొండ: మహిళలకు ఫ్రీ ట్రైనింగ్

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో టైలరింగ్, కంప్యూటర్ కోర్సులో ఉచిత శిక్షణకు ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మహిళా శిశు వికాస కేంద్రం మేనేజర్ ఎ.అనిత తెలిపారు. అర్హత, పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


